ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు

-

ఆంధ్రప్రదేశ్ లో ముగ్గులు సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటిలిజెంట్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జత్వానిని వేధించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. తనపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కీలకపాత్ర పోషించారని నటి జత్వాని విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

జత్వానిని అరెస్టు చేయడానికి ముందే ఏపీ పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్లి ఆమెని ఆ కేసులో ఎలా ఇరికించారో, ఎవరితో ఫిర్యాదు చేయించాలి అనే అంశాలను ప్లాన్ చేశారని.. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని ప్రమేయం ఉందని జెత్వాని తెలిపారు. ఈ ఆరోపణల నేపద్యంలోనే వీరిపై వేటుపడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version