జగన్‌ కు షాక్‌..వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

-

జగన్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చింది టీడీపీ పార్టీ. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఈఓ ఎంకే మీనాకు లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. నిబంధనలకు వ్యతిరేకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో వలంటీర్లు పాల్గొంటున్నారని ఈ లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లు.. వారిని అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జూలై 20న రాజకీయ పార్టీ సమావేశాల్లో ఇచ్చిన హామీ జూలై 21 తేదిన ఉల్లంఘనకు గురి కావడం ఆందోళనకరం అని లేఖలో అచ్చెన్నాయుడు వివరించారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని కోరారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version