నోటికి అడ్డు, అదుపు లేదు.. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఫైర్

-

భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంక‌ట్ రెడ్డి నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజ‌మ‌ని అన్నారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని.. తాను మాత్రం భాష విషయంలో హుందాగా ఉంటానని స్పష్టం చేశారు. జిల్లా మంత్రికి తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని తేల్చి చెప్పారు.

త‌న కుమారుడు అమిత్‌కు టికెట్ విష‌యంలో పార్టీదే తుది నిర్ణ‌య‌మ‌ని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. టికెట్ కోసం పైరవీలు చేయ‌న‌ని చెప్పారు. వామపక్షాలతో సీట్లు పొత్తు ఖరారు అయ్యాకనే ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మార్పుపై క్లారిటీ వచ్చే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. . ఎక్కడ పని చేసినా రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలని హితవు పలికారు. ప్రజలు తమ పనిని అభినందిస్తున్నారా లేదా అనేది ప్రజాప్రతినిధులు తరచూ పరిశీలించుకోవాలని గుత్తా సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version