ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధిక ధరల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. సామాన్యులకు అందకుండా నిత్యవసర వస్తువల ధరలు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అలాగే పెట్రోల్, డిజిల్ తో పాటు ఇటీవల కరెంటు బిల్లు కూడా పెంచారని తెలిపారు వీటి వల్ల రాష్ట్రంలో ప్రజలు చాలా నష్ట పోతున్నారని అని మండి పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే సంక్రాంతి కూడా అధిక ధరలతో కష్టం గా మారుతుందని ప్రభుత్వంపై చంద్రబాబు మండి పడ్డారు.
కాగ సోమవారం టీడీపీ అధినేత చంద్ర బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణించారు. ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి అనే నినాదం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే కుప్పంలో మైనిగ్ మాఫియా జరుగుతుందని దాని అరికట్టడంతో ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. అలాగే గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయాలని ఈ సమావేశంలో నిర్ణియించారు.