లోన్ అప్లికేషన్ రిజక్ట్.. బ్యాంకుకు నిప్పు

-

లోన్ అప్లికేషన్‌ను రిజక్ట్ చేయడంతో నిరాశకు గురైన ఓ వ్యక్తి బ్యాంక్‌కు నిప్పు పెట్టిన సంఘటన కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలో చోటుచేసుకున్నది. ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్లు 435, 436, 477 కింద కేసు నమోదు చేసినట్లు కజినెల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ వ్యక్తి లోన్ నిమిత్తం బ్యాంకు సిబ్బందిని సంప్రదించాడు. అతని డాక్యుమెంట్లను పరిశీలించిన బ్యాంకు అధికారులు లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version