టీడీపి, జనసేన, వైసీపీ ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ పేర్కొన్నారు. తాజాగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్ సవాల్ చేసుకుంటారు.. జగన్ కి నేనొక అవకాశం ఇస్తున్నా.. నాతో కలవమనండి అన్నారు. జగన్ చంద్రబాబు ని సిద్ధమా అంటున్నాడు..? అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు, జగన్ కి నా సవాల్.. అంబేద్కర్ కి విగ్రహం అవసరమా..? దళితులు విగ్రహలతో మోసపోరు.
బడుగు, బలహీన వర్గాల వారికి నా విన్నపం.. ఏమనగా..? అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగాడు.. విగ్రహాలు పెట్టమని అంబేద్కర్ అడిగాడా? అని ప్రశ్నించారు. నేను ఏ మతాన్ని, కులాన్ని విమర్శలు చేయను. పవన్ కళ్యాణ్ కి ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడు. జగన్ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నాడు. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నాడు. వైజాగ్ నుండి ఎంపీ గా పోటీ చేస్తా.. మీడియా మీద దాడి చేయడం సిగ్గు చేటు.. మీడియా పై దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు.