తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 12,500 టీచర్ ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు కార్యచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు 563 గ్రూపు-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. వచ్చే వారం ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది.
లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్బాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే వాస్తవానికీ ఇటీవల గురుకుల, పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి నోటిఫికేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసి ఇచ్చినట్టు నియామక పత్రాలు అందజేయడం విడ్డూరం అని బీఆర్ఎస్ కీలక నేతలు పేర్కొనడం గమనార్హం.