ఎంపీ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

-

ఎన్నో మలుపులు తిరిగిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్​పై ఎట్టకేలకు తీర్పు వచ్చింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చేస్తే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలకు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని అవినాష్‌కు షరతు విధించింది.

ఏప్రిల్‌ 17 నుంచి అనేక మలుపులు తిరిగిన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఎట్టకేలకు హైకోర్టు తీర్పును వెలువరించింది. బాహ్య ప్రపంచానికన్నా ముందే సీఎం జగన్‌కు వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని, అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా! అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈనెల 26, 27 తేదీల్లో తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. 27వ తేదీన ఆఖరి వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరిస్తానని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version