రజినీకాంత్ రాజకీయ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయన సోదరుడు..!

-

చిత్రాల ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ ఆయన మళ్ళీ రాజకీయాల వైపు ముగ్గు చూపలేదు. దానికి ఆరోగ్యం సహకరించడం లేదనే కారణాన్ని కూడా ఆయన అందరి ముందు తెలిపారు. ఇక అప్పటినుంచి ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రజినీకాంత్. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంతో పాటు జైలర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఇవే కాకుండా మరో రెండు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన పై ఆయన సోదరుడు సత్యనారాయణ రావు షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే.. తన అన్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదని వెల్లడించారు అయితే ఇందుకి కారణాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది. సోమవారం తిరుచెందూర్ కుమారస్వామి ఆలయానికి ఆయన రాగా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ నటించిన సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి.. దేవుని దయ వల్ల ఆయన సుదీర్ఘకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని కోరుకున్నారు.

ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదు అని ఎందుకంటే ఆయన వయసు 7 పదులు దాటడమే దానికి కారణం అని.. అదేవిధంగా ఆయన ఎవరికి కూడా మద్దతు పలికే అవకాశం లేదు అని… ఏ పార్టీకి ఆయన మద్దతు పలకరు అని కూడా రజనీకాంత్ సోదరుడు స్పష్టం చేశారు. మొత్తానికి అయితే రజనీకాంత్ ఇకపై రాజకీయాలలోకి రారు అని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version