ఒంగోలులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘోరంగా కొట్టుకున్నారు.ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి ఘోరంగా కొట్టుకున్నారు. అక్కడికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ చేరుకోగా.. మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరుపార్టీల కార్య కర్తలను చెదరగొట్టి, గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగినప్పుడు బాలినేని కోడలు కూడా ఉన్నారట.
ఇక ఈ సంఘటనపై బాలినేని స్పందించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మా కోడలిపై టీడీపీ శ్రేణులు నానా దుర్బాషలాడి దాడికి ప్రయత్నించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సబమాదానం చెప్పాలని ఆగ్రహించారు. ఒంగోలులో భయానక పరిస్దితులు సృష్టించి టీడీపీ లబ్ది పొందాలని చూస్తున్నారని.. గొడవ జరిగిన ప్రాంతానికి ఏం జరిగిందో సామాన్య వ్యక్తులను అడిగి తెలుసుకోవాలని మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం ఒంగోలు కమ్మపాలెంలో ఇదే తరహా ఘటనకు పాల్పడి అక్రమ కేసులు పెట్టారు..మేము అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. మీ ఫ్యామిలీలో ఎవరినైనా ఇలాగే బూతులు తిడితే ఊరుకుంటారా..? అని నిలదీశారు బాలినేని.