ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల, హంద్రీ నుంచి శ్రీశైల జలాశయానికి గురువారం ఇన్ ఫ్లో భారీగా నమోదయింది. జూరాల నుండి 52, 120 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల చొప్పున నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. అలాగే సుంకేసుల జలాశయం నుంచి 2,198 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వస్తుంది. దీంతో శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి జలాశయ నీటిమట్టం 821.20 అడుగులు ఉంది.
ప్రస్తుతం నీటి నిలువ 42, 0842 టీఎంసీలుగా నమోదు అయింది. అలాగే ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ధవలేశ్వరం బ్యారేజీకి వచ్చి చేరుతుంది. దీంతో వరద నీటిని భారీగా సముద్రంలోకి వదులుతున్నారు. యానం బీచ్ వద్ద గోదావరి వరద నీటి తాకిడి పెరిగి పుష్కర ఘాట్, పర్యాటక బోట్ హౌస్ నీటమునిగాయి.