TDP-Janasena : కూటమికి తలనొప్పిగా మారిన గాజు గ్లాస్ గుర్తు…!

-

ఏపీలో కూటమికి తలనొప్పిగా మారింది గాజు గ్లాస్ గుర్తు. జనసెన పోటీ చెయ్యని స్థానాల్లో ఇతరులకు గాజు గుర్తు కేటాయింపులు చేశారు ఎన్నికల అధికారులు. కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు అధికారులు. ఒక పక్క గాజు గ్లాస్, మరో పక్క గ్లాస్ ను పోలిన ఇతర సింబల్స్ ఉన్నాయి.

The glass symbol that has become a headache for the alliance

21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటి జనసెన పోటీలో ఉంది. ఎన్టీఆర్ జిల్లాల్లో అసలు పోటీలో లేని లేదు జనసెన. కానీ ఎన్టీఆర్ జిల్లాల్లో ముడు చోట్ల ఇతరులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు చేశారు ఎన్నికల అధికారులు.

అటుకావలి, ఆత్మకూరు నియోజకవర్గాలలో టీడీపీకి గ్లాస్‌ గుర్తు టెన్షన్‌ పెడుతోంది. నెల్లూరు జిల్లాలోని కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ కు క్లాస్ గుర్తు కేటాయించారు ఎన్నికల అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version