తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో గోల్డ్ మెన్ దర్శనమిచ్చాడు. తన ఉల్లంతా బంగారం తీసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఆ గోల్డెన్ మన్. దాదాపు 5 కేజీల బంగారాన్ని తన ఒంటిపై… ధరించుకున్నాడు. అయితే అతని పేరు తెలియదు కానీ…. కొత్త సంవత్సరం నేపథ్యంలో బంగారాన్ని ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఆ గోల్డ్ మ్యాన్.
దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా, తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమల లో శ్రీవారి దర్శనం కోసం… 2 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. దింతో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 62,495 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 19,298 మంది భక్తులు..నిన్న తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.8 కోట్లుగా నమోదు అయ్యాయి.
5 కేజీల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గోల్డ్ మ్యాన్ pic.twitter.com/MrJcN9nCfk
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2025