మందు పార్టీ.. చెత్త డంపింగ్ యార్డులా మారిన ఉప్పల్ మున్సిపల్ స్టేడియం

-

ఉప్పల్ మున్సిపల్ స్టేడియం చెత్త డంపింగ్ యార్డులా మారింది. ఈ స్టేడియంలో ప్రతిరోజూ ఉదయం స్థానికులు వాకింగ్ చేస్తుంటారు. ఎప్పటిలాగే నేడు కూడా వాకర్స్ వచ్చి చూసే సరికి అసలు స్టేడియం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. అచ్చం మున్సిపాలిటీ డంపింగ్ యార్డులా దర్శనం ఇచ్చేసరికి స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు.

ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అధికారులు అనుమతిని ఇవ్వడమే అందుకు కారణంగా తెలుస్తోంది.స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఉదయం వాకింగ్ వచ్చిన కాలనీ వాసులు అటు మున్సిపల్ అధికారులు, న్యూయర్ పార్టీ నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. ఇలా చేస్తే తాము వాకింగ్ ఎక్కడా చేసుకోవాలని విమర్శలు గుప్పిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version