BREAKING : టమాటా ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి దాకా రూ.130 నుంచి రూ.150 దాకా ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.200 దాటేసింది. కొన్నిచోట్ల మూడు వందలకూ చేరింది. ఇక ఏపీలో టమాటా ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
మరికొన్ని చోట్ల రికార్డు ధర పలుకుతూ ఆపిల్‌కు తానేం దిగదుడుపు కాదని టమాట ధరలు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. సామాన్యులకు శుభవార్త అందింది. ఏపీలోని కర్నూలు జిల్లాలో టమాట ధర దిగివచ్చింది. ఆ జిల్లాలోని రైతు బజారులో కిలో టమాట రూ.50 నుంచి రూ.80 మధ్య నడుస్తోంది. స్థానిక పంట మార్కెట్ కు రావడంతో ధర తగ్గింది. కడప జిల్లాలో సాగయిన టమాట పంట మార్కెట్ కు తెస్తున్నారు రైతులు. దీంతో తగ్గుముఖం పట్టాయి ధరలు.