నేడు,రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్ జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట కు ఉదయం 10.25 కు చేరుకుంటారు. ఇక్కడ గోదావరి వరదల ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన అనంతరం కూనవరం బస్‌స్టాండ్ సెంటర్‌లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు.
ఆ తర్వాత ఇక్కడి నుంచి మ.12.45 బయలుదేరి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం కి మ 1.40 కు చేరుకుంటారు. ఇక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన ఉంటుంది. అనంతరం వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మ .3.40 కి బయలుదేరి సాయంత్రం 4.10 రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ చేరుకుని అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రాత్రికి బస చేస్తారు.
ఉదయం 9.10 గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి అతిధి గృహం నుంచి బయలుదేరి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు ఉ 9.20 కి చేరుకుని, ఇక్కడ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కు బయలుదేరి వెళతారు. ఇక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత ఠానేలంక , రామాలయంపేట గ్రామాలకు చేరుకుంటారు. ఇక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అక్కడి నుంచి మ .12.15 కి బయలుదేరి ఇదే రోజు మధ్యాహ్నం మ.1.10 కి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.