ఏపీ ప్రజలకు అలర్ట్…రేపటి నుంచి పిల్లలకు ఆధార్ కార్డుల జారీ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం అయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధార్ కార్డు లేని చిన్నారులు 11 లక్షల 65 వేల మంది పైగా ఉన్నట్టు సమాచారం అందుతోంది.
ఈ తరునంలోనే… ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివా లయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి… ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఆదేశాలు వచ్చాయి.