నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం..తొలిసారి స్పందించిన జనసేన..!

-

నారా లోకేష్‌ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్‌ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామని… లోకేష్ ను డిప్యూటీ పదవీలో చూడాలని టిడిపి కేడర్ కోరుకోవడంలో తప్పదులేదన్నారు. మాకు పవన్ కల్యాణ్ ను సిఎం గా చూడాలని పదేళ్ళ గా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

Janasena Kiran Royal First Reaction on Nara Lokesh As Deputy

పవన్ సిఎం చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని వివరించారు. ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్ళారో అదే కోనగిస్తే మంచిది‌…అనవసరంగా వైసిపి నేతలకు మాటలకు ఊపిరి పోయాకండని వార్నింగ్‌ ఇచ్చారు. వైసీపీ లో కొంతమంది జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు.. వాళ్లకు అవకాశము ఇవ్వవద్దన్నారు. చిరంజీవితో కన్నా చంద్ర బాబు తోనే ఎక్కువ జర్నీ చేస్తున్నాము..పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారని గుర్తు చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై రెండు రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి..డ్రోన్ కెమెరా లపై 5 మంది అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారన్నారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావలసిన నాయకుడు..అందుకే భద్రతా పెంచాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version