విజయవాడలో అక్రమాలకు అడ్డగా మారుతున్న రిజిస్ట్రార్ కార్యాలయాలు

-

విజయవాడలో అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి రిజిస్ట్రార్ కార్యాలయాలు. ఏసీబీ దాడులు చేస్తున్నా అవినీతి కంపు వదలడం లేదు. పటమట, గాంధీనగర్, మాచవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కాసుల వర్షం కురుస్తోంది. పటమట రిజిస్ట్రార్ పోస్ట్ కోసం కోటి నుంచి కోటిన్నర వరకు బేరసారాలు కొనసాగుతున్నాయి. ఆడిట్ ఆఫీస్ లో రిజిస్ట్రార్, డిప్యూటేషన్ విధుల్లో ఉన్న మరో రిజిస్ట్రార్ పోటా పోటీ లాబీయింగ్ లకు పాల్పడుతున్నారు.

రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసూళ్ళ కోసం ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇటీవల డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినా రిజిస్ట్రార్ల తీరు మారడం లేదు. ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ఆఫీసులో అర్థరాత్రి వరకు రిజిస్ట్రార్, సిబ్బంది ఉండటంపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. ఆదాయానికి మించి కోట్లలో ఆస్తులు రిజిస్ట్రార్లు కూడగడుతున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏసీబీ తనిఖీలు కేవలం లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న కేసులే నమోదు చేయటంపై విమర్శలు వస్తున్నాయి.

బెజవాడలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల మధ్య తారా స్థాయికి చేరింది కోల్డ్ వార్. ఒకరిపై మరొకరు ఫిర్యాదు లతో రచ్చ కొనసాగుతోంది. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ రాఘవ రావు అరెస్ట్, రిమాండ్ రిపోర్టులో దిమ్మదిరిగే విషయాలు నమోదు చేసింది ఏసీబీ. రిజిస్ట్రార్లు అందరూ డబ్బులు వసూలు చేసి ఉన్నతాధికారికి ఇస్తున్నట్టు చెప్పినట్టు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ లో వెళ్లడయింది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version