హైకోర్టుకి చేరిన డింపుల్ హయాతి పార్కింగ్ పంచాయితీ

-

టాలీవుడ్ నటి డింపుల్ హయాతి పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుని పార్కింగ్ ప్లేస్ లో డింపుల్ హయార్టీ కి కాబోయే భర్త డేవిడ్ ఢీకొట్టాడు అన్న కారణంగా వారిపై కేసు నమోదు అయింది. అయితే తాజాగా ఈ పార్కింగ్ పంచాయితీ హైకోర్టుకి చేరింది.

జూబ్లీహిల్స్ పోలీసులు తనపై నమోదు చేసిన కేస్ కొట్టేయాలని కోర్ట్ ను ఆశ్రయించింది డింపుల్. తన అధికారాన్ని ఉపయోగించి ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేస్ పెట్టించారని డింపుల్ ఆరోపిస్తోంది. తన BMW కార్ తో ఐపీఎస్ అధికారిక వాహనాన్ని డీ కొట్టినట్టు కోర్ట్ కు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ). వివాదం అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందన్నారు పిపి.

కార్ ను డీ కొట్టిన ఫోటోలను కోర్ట్ కు చూపించారు పీపీ. ఒకవేళ విచారణకు పిలవాలనుకుంటే 41- ఏ కింద నోటీస్ ఇవ్వాలని స్పష్టం చేసింది హైకోర్టు. ఇప్పటికే డింపుల్ కు నోటీస్ ఇచ్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. డేవిడ్ విక్టర్ కి సైతం 41 – ఏ నోటీస్ ఇవ్వాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version