ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ చార్జీలను పెంచే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. పేదలపై విద్యుత్ భారానికి గత ప్రభుత్వమే కారణమని.. ఆ రంగం పై రూ.1.25 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. 1998లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చానని గుర్తు చేశారు. తలసరి కరెంట్ వినియోగం కూడా పెంచినట్టు తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాను.
గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్ర గల్లా పెట్టే ఖాలీ చేశారు. ఒక్క యూనిట్ కూడా వాడకుండా వేల కోట్లు చెల్లించారు. చరిత్రలో గుర్తుండి పోయేలా అమరావతి ఉద్యమం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేశారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో అంతా మోసమే జరిగింది. తనను అవమానించడమే కాకుండా తన భార్యను కూడా అవమానించారు. తన భార్య వల్ల తాను కన్నీళ్లు పెట్టిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు సీఎం చంద్రబాబు.