ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే రిపోర్టు ఇదే !

-

ఏపీ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లో ఓటు హక్కు వినియోగించుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పోలింగ్ బూతులను సందర్శించారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ…. 2019 నుంచి సర్వేలు చెప్పడం మానేశాను… ఇంతకుముందు రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజల నాడీ తెలుసుకునేవాడిని అన్నారు.

This is the Lagadapati survey report on AP elections

ఇప్పుడు రాజకీయాల్లో లేను…రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇంక లేదని వివరించారు. ఎప్పుడు లేని విధంగా ఓటింగ్ బాగా జరుగుతుంది….మధ్యాహ్నం సమయం ఖాళీగా ఉంటుందని ఓటెయ్యడానికి వచ్చానన్నారు. కానీ ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసిన బారులు తీరిన జనాలు ఉన్నారని వెల్లడించారు. ప్రజలందరూ ఉత్తేజంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది ఓటు అలాంటి ఓటు హక్కు ను ప్రజలందరూ వినియోగించు కోవాలని తెలిపారు. సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది… మొత్తం ప్రజలందరూ ఓట్లు వేయడానికి బస్సుల్లో ఫ్లైట్లో ట్రైన్లో వస్తున్నారన్నారు. జూన్ 4వ తేదీ ఎవరు గెలుస్తారో మీకే తెలుస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version