ఏపీ అసెంబ్లీ కాసేపట్లో కానుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. మూలపేట ఓడ రేవు నిర్వాసితులకు సహాయ, పునరావాసం, బలవర్ధకమైన బియ్యం పంపిణీ, దిశా బిల్లు పై ప్రశ్నలు, దేవాలయ భూముల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్, నవ రత్నాలు – పేదలందరికీ ఇళ్ళు, అంశాల పై ప్రశ్నలు ఉండనున్నాయి.
అలాగే, నూతన వైద్య కళాశాలల్లో ఫీజులు, మహిళా సాధికారత అంశాల పై ప్రశ్నలు ఉంటాయి. కాగా.. ఇవాళ్టి సభలో మూడు బిల్లులను ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ బిల్లు- 2023, ఏపీ వైద్య విధాన పరిషత్ రిపీల్ (రద్దు) బిల్లు -2023, ఏపీ ఆధార్ బిల్లు -2023 ఇవాళ్టి సభలో ఈ మూడు బిల్లులను ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం – తీసుకున్న చర్యల పై స్వల్ప కాలిక చర్చ కూడా జరుగనుంది. ఇక నిన్న టీడీపీ సభ్యులు ఒక రోజు పాటు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.