తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. తెలంగాణ రాష్ట్రానికి నేడు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది ఐఎండీ. తెలంగాణలోని ఉత్తర పశ్చిమ జిల్లాలలో నేడు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది ఐఎండీ. ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురిసే వర్ష పాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది.
జగిత్యాల, కామారెడ్డి, కొమరం భీమ్, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వివరించింది ఐఎండీ. భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల్, ములుగు, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాలు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ కు నేడు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది ఐఎండీ. దీంతో హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ…ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.