తిరుమల భక్తులకు అలర్ట్..నేటి నుంచి సాధారణ దర్శనాలు !

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగిశాయి. ఇవాళ్టి నుంచి ఎలాంటి టోకెన్లు లేకుండా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది.

tirumala

కాగా, మళ్లీ ఈ ఏడాది డిసెంబర్‌లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇది ఇలా ఉండగా..తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే పదిరోజుల వ్యవధిలో 7.5 లక్షల మంది కి ఉత్తర ద్వార దర్శనం దక్కింది.

2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022-22 లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2020-21 లో 4 లక్షల మంది భక్తులు..వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి సర్వ దర్శనానికి అనుమతి ఇస్తోంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version