తొక్కిసలాట ఎఫెక్ట్..టోకెన్ల జారీపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. తిరుమలలో 8వ తేదిన తొక్కిసలాట ఘటన జరిగింది. దీంతో టోకేన్ల జారి పై పునరాలోచనలో టిటిడి ఉందని అంటున్నారు. సర్వ దర్శనం భక్తులకు తిరుమలలోనే టోకెన్లు జారి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు టిటిడి అధికారులు.
మరో ప్రత్యామ్నాయంగా సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లో జారి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు టిటిడి అధికారులు. వైకుంఠ ద్వార దర్శనాని గతంలో లాగా రెండు రోజులకు కుదించే అంశాని పరిశీలిస్తున్నారు టిటిడి పాలక మండలి అధికారులు. రాబోవు పాలకమండలి సమావేశంలో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది టిటిడి.