తిరుమల భక్తులకు అలర్ఠ్.. దర్శనాలకు 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని 06 కంపార్టుమెంట్లలో శ్రీవారి భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. ఇక అటు 62, 085 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
15,680 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.17 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమల 10వ తేది నుంచి 19వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఇక ఈ తరుణంలోనే… ఆఫ్ లైన్ లో 4 లక్షల దర్శన టోకెన్లు జారీ చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఆఫ్ లైన్ లో 4 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసేందుకు గానూ తిరుపతిలో 8 ప్రాంతాల్లో….తిరుమలలో 1 ప్రాంతంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అటు ఈ నెల 9వ తేదీ ఉదయం 5 గంటలకు మూడు రోజులకు సంబంధించిన లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయనున్నారు.
తిరుమల..06 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 08 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62085 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 15680 మంది భక్తులు
హుండి ఆదాయం 4.17 కోట్లు