తిరుమల భక్తులకు అలర్ట్..ఇవాళ దర్శనాలకు 10 గంటలకు పైనే పడుతోందని సమాచారం. మకర సంక్రాంతి నేపథ్యంలో తిరుమలకు భారీ భక్తులు వచ్చారు. 78000 మంది భక్తులు..నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే…17406 మంది భక్తులు తిరుమల శ్రీవారి తలనీలాలు సమర్పించారు.
ఇక నిన్న ఒక్క రోజే… తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.44 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల….ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవం
- మధ్యాహ్నం 12 గంటలకు పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం
- సాయంత్రం 4 గంటలకు మాడవీధులలో ప్రణయ కలహ మహోత్సవం
- ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి