ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు విపరీతంగా వెళుతున్నారు. దీంతో సంక్రాంతి పండుగ తరునంలోనే… మహా కుంభమేళాకు భారీ స్థాయిలో భక్తులు పోటెత్తారు. దీంతో రెండో రోజు.. మహా కుంభమేళా లో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య అక్షరాల 3.5 కోట్లకు చేరింది. తొలిరోజు కోటిన్నర మంది వస్తే.. రెండో రోజు రెండింతలకు మించి వచ్చారు.
మహా కుంభమేళా లో పుణ్యస్నానాలు చేసి.. దైవ దర్శనం చేసుకున్నారు భక్తులు. దేశంలోనే ఇది అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కావడం విశేషం. అది కూడా 144 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు కాబట్టి.. కోట్లాది మందితో కుంభమేళా ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఇక ఈ మహా కుంభమేళాకు విదేశీ భక్తులు కూడా వస్తున్నారు. మహా కుంభమేళా లో పుణ్యస్నానాలు చేసి..తమ పాపాలు కడుక్కుంటున్నారు. ఇక అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు అధికారులు.