తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం… 2 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. దింతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
ఇక నిన్న 62,495 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 19,298 మంది భక్తులు..నిన్న తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.8 కోట్లుగా నమోదు అయ్యాయి.
అటు 2024లో తిరుమలకు భారీ సంఖ్యలోనే భక్తులు వచ్చారు. 2024 సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే ఈ ఏడాది శ్రీవారికి హుండీ ద్వారా 1365 కోట్ల రూపాయల కానుకలు సమర్పించారు భక్తులు. ఈ మేరకు TTD ప్రకటన చేసింది.