అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.తనపై అధికారులు క్షక్ష్య సాధింపు చర్యలకు దిగారని నూగురు మండల ఇంచార్జి సీడీపీఓగా పనిచేస్తున్న ధనలక్ష్మి చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నీటిపర్యంతం అయ్యింది.
అయితే, డీడబ్ల్యుఓతో కలిసి కిందిస్థాయి సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు తప్పుడు ఫిర్యాదు చేసి తనను సస్పెండ్ చేయించారని.. మనస్తాపంతో ధనలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో ధనలక్ష్మికి వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారు.