వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఆస్పత్రికి రాత్రికి రాత్రే కొడంగల్ జనరల్ హాస్పిటల్‌గా పేరు మార్చుతూ కొత్తగా ఫ్లెక్సీ ఏర్పాటైంది. ప్రవేశద్వారానికి ఉన్న బోర్డుపై ‘ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి- కొడంగల్’ అంటూ ఫ్లెక్సీ కట్టడాన్ని స్థానికులు నిలదీశారు.ఆసుపత్రి వర్గాల నుంచి సరైన సమాచారం లేకపోవడం, ఫ్లెక్సీ కడుతున్న గుత్తేదారు దురుసుగా మాట్లాడటంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడం తీవ్రఉద్రికత్త నెలకొంది. అనంతరం స్థానికులు ఫ్లెక్సీని చించేశారు.
ఇదీ అసలు కథ..
గత ప్రభుత్వంలో జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి తన సొంత నియోజవర్గం కొడంగల్‌కు మార్చుకున్న విషయం తెలిసిందే.దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉండగా మరో వారంలో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బృందం కొడంగల్‌కు తనిఖీ నిమిత్తం రానున్నట్లు సమాచారం.
వారికి చూపించేందుకు తాండూరులోని 200 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా.. స్థానికులు చింపేశారు.