Tirumala: తిరుమల వెళ్లేవారికి అలర్ట్.. ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు

-

 

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. ఈ నెల 9,16వ తేదిలలో శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. ఈ నెల 9వ తేదిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,16వ తేది ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి.

Tirumala TTD VIP break darshan at Srivari temple on 9th and 16th of this month are cancelled

తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీన అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టిక్కేట్లను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

అటు తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65, 775 మంది భక్తులు కాగా.. 25, 126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3. 41 కోట్లుగా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version