కేసీఆర్‌ కు షాక్‌..నేడు కాంగ్రెస్‌ పార్టీలోకి మరో ఎమ్మెల్యే..!

-

గద్వాలలో బీఆర్‌ఎస్‌ పార్టీకి అందరూ అనుకున్నట్లుగానే ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారట గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి.

A shock to KCR Another MLA joins the Congress party today

ఈ మేరకు కాసేపటి క్రితమే…. హైద్రాబాద్ కు బయలుదేరారట గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి. మరికాసేపట్లో రేవంత్ రెడ్డి తో భేటీ కానున్నారు. అటు గద్వాల సరిత ను బుజ్జగించే పనిలో అధిష్టానం పెద్దలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.

తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరులతో వెల్లడించారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య సహా పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version