Tirupati Inter Model Bus Station: తిరుమలకు వచ్చే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. తిరుమలకు వచ్చే భక్తులకు అనేక వసతులు ఒకే చోట లభించేలా తిరుపతిలో ప్రస్తుతమున్న బస్టాండ్ స్థానంలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్‌లో బస్టాండ్, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, తదితరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక రోజే శ్రీవారిని 87,347 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.