విజయవాడ డివిజన్‌లో ఇవాళ కూడా రైళ్ల రద్దు

-

ఏపీలో మిగ్​జాం తుపాను భీభత్సం సృష్టించింది. ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాసానికి తరలిస్తోంది. మరోవైపు అప్రమత్తమైన రైల్వే యంత్రాంగం విజయవాడ డివిజన్‌ పరిధిలోని ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టింది.

ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ హైఅలర్ట్‌ ప్రకటించి.. రైల్వే ట్రాక్‌పై నీరు చేరే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. 24 గంటలూ రైల్వే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రైళ్ల నిలిపివేతతో నిత్యం కిటకిటలాడే విజయవాడ స్టేషన్‌ రైళ్ల రద్దు కారణంగా అన్ని ప్లాట్‌ఫారాలు నిర్మానుష్యంగా మారాయి.

పూర్తిగా రద్దు చేసిన రైళ్ల వివరాలు..

07784/07785 గుంటూరు- రేపల్లె, 07786 గుంటూరు-రేపల్లె, 07873/07874 రేపల్లె-తెనాలి, 07875/07876 రేపల్లె-తెనాలి, 07787/07888 రేపల్లె-తెనాలి, 07887 గుంటూరు-రేపల్లె, 22611 చెన్నైసెంట్రల్‌-న్యూజల్పాయిగురి.

ఇవాళ పునరుద్ధరణించిన రైలు సేవలు..

తుపాను కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైలు నంబరు 12710 సికింద్రాబాద్‌-గూడూరు, 12733 తిరుపతి-లింగంపల్లి, 12764 సికింద్రాబాద్‌-తిరుపతి, 12710 కాకినాడటౌన్‌-బెంగళూరు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version