నేడు పోలీస్‌ స్టేషన్‌ కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ !

-

నేడు పోలీస్‌ స్టేషన్‌ కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెళ్లనున్నారు. మొట్ట మొదటి సారి ఇవాళ పోలీస్ స్టేషన్ లో విచారణ కు హాజరు అవ్వనున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇక ఈ సందర్భంగా అర్జీవిని విచారించనున్నారు ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్‌ బాబు. వ్యూహం సినిమా ప్రమోషన్‌ కోసం చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు అంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై కంప్లైంట్ ఇచ్చారు టిడిపి నేత.

Today the director of the police station Ram Gopal Varma

అదే సమయంలో ఆర్జీవిని అరెస్ట్ చేస్తారంటూ పెద్ద యెత్తున ప్రచారం జరిగింది. కానీ హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ కి కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చారు. లేటెస్ట్ గా కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చినా విచారణకు సహకరించాలని తెలుపడంతో ఆయనకు పోలీసులు నోటిసులు ఇచ్చారు. దీనితో ఇవాళ ఉదయం విచారణకు వస్తాను అని సమాచారం ఇచ్చిన ఆర్జీవీ….పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version