ఇవాళ టిటిడి పాలకమండలి సమావేశం..133 కోట్ల కార్యక్రమాలకు ఆమోదం !

-

ఇవాళ టిటిడి పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా 100 కోట్ల రూపాయల వ్యయంతో వసతి సముదాయం, 33 కోట్ల రూపాయల వ్యయంతో క్యూ లైను నిర్మాణంకు ఆమోదం తెలుపనుంది పాలక మండలి. ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగుల నియామకం, వకులామాత ఆలయాని టిటిడి పరిధిలోకి వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది టిటిడి పాలక మండలి. ఇక ఎల్లుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

సాయంత్రం 6 గంటలకు మాడవీధులలో విహరించనున్నాడు శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు. 27వ తేది ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.. 27వ తేది మధ్యహ్నం మాడ వీధులలో గరుడ పఠం,పరివార దేవతల ఉరేగింపు ఉండనుంది. అదే రోజు రాత్రి శ్రీవారికి పట్టువస్ర్తాలను సమర్పించనున్నారు సియం జగన్. 28వ తేది ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం, 29వ తేది ఉదయం 8 గంటలకు సింహ వాహనం, 30వ తేది ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం కార్యక్రమాలు జరుగనున్నాయి.

TTD Governing Council meeting will be held today

Read more RELATED
Recommended to you

Exit mobile version