తిరుమల భక్తులకు అలర్ట్..దర్శనాలకు ఎంత టైం అంటే ?

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. తిరుమలలోని కంపార్ట్మెంట్లో… భక్తులు వేచి ఉండకుండానే…. తిరుమల శ్రీవారి దర్శనం జరుగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ…. నేరుగా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. దీంతో తిరుమలలోని కంపార్ట్మెంటులో… వేచి ఉండకుండానే తిరుమల శ్రీవారి దర్శనం జరుగుతోంది శ్రీవారి భక్తులకు !

tirumala

ఈ తరుణంలోనే నిన్న ఒక్కరోజున తిరుమల శ్రీవారిని 59 వేల 140 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. అలాగే నిన్న ఒక్కరోజు… 16,937 మంది…. తిరుమల శ్రీవారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం… నిన్న ఒక్కరోజున 3.31 కోట్లుగా నమోదు అయింది. ఇక దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో విపరీతంగా భక్తులు… ఈ వారం రోజులపాటు ఉంటారని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version