టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందారు. గుండెపోటుతో తిరుపతిలోని స్వగృహంలో మృతి చెందారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సంప్రదాయ సంగీత ప్రపంచానికి గరిమెళ్ల మృతి తీరని లోటు అని ఆయన అన్నారు. ఇక టీటీడీ ఆస్థాన విద్వాంసుడుగా గరిమెళ్ల విశేష సేవలందించారు. గరిమెళ్ల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభుతి అని పేర్కొన్నారు.
అయితే వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన ఘనత గరిమెళ్ల సొంతం. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చాడు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ప్రసిద్ధులు. 1978 నుండి 2006 వరకు టిటిడిలో ఆస్థాన గాయకుడిగా పనిచేసారు గరిమెళ్ళ. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు.