కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. సీపీఐ పార్టీకి ఒక సీటు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది కాంగ్రెస్. మొత్తం మూడు సీతాలలో ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీలకు సితు కేటాయించారు. ఎన్నికలకు ముందు ఇన్చార్జి థాక్రే హామీ ఇచ్చారని విజయశాంతికి అధిష్టానం కోటాలో సీటు ఇచ్చారు.
అయితే ఈ ముగ్గురు mlc అభ్యర్థుల్లో.. సీఎం కోటాలో అద్దంకి దయాకర్.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జానారెడ్డి కోటాలో శంకర్ నాయక్.. ఇక అధిష్టానం కోటాలో విజయశాంతికి సితు ఇచ్చారు. అయితే సీపీఐ కి సీటు ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్.. సీఎం రేవంత్ సిఫార్సు చేసినట్లై తెలుస్తుంది. అయితే ఎమ్యెల్సీ అభ్యర్థి ఎంపిక పై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. కార్యవర్గ సభ్యులు. ఈ సీట్ కేటాయింపు పై ఏఐసీసీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక సమావేశం ప్రారంభమైంది.