టీటీడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో కోట్ల వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తుంది టీటీడీ పాలక మండలి. అయితే తాజాగా.. టీటీడీ వార్షిక బడ్జెట్.. రికార్డులు సృష్టించింది. 2023-24 సంవత్సరానికి రూ.4411 కోట్ల అంచనా వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది టీటీడీ పాలకమండలి.
హుండీ ద్వారా రూ.1591 కోట్ల ఆదాయం అంచనా వేసింది. వడ్డీల ద్వారా రూ. 990 కోట్లు రాగ.. ప్రసాదం విక్రయం ద్వారా రూ.500 కోట్లు వచ్చాయి. ఇక దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ. 330 కోట్లు అంచనా వేసింది టీటీడీ పాలక మండలి.
కాగా…తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త. ఇవాళ జూన్ నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టిటిడి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చెయ్యనుంది టీటీడీ.