లోన్లు తీసుకునే వారికి RBI గుడ్‌న్యూస్ చెప్పింది.. రెపో రేటు తగ్గింపు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). ఫిబ్రవరి నెల రావడంతో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది.
దీంతో రెపో రేటు 6.50 నుంచి 6.25 శాతానికి చేరుకుంది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.