తిరుమల భక్తులకు శుభవార్త..రేపటి నుంచి మార్చి దర్శన టిక్కెట్లు !

-

తిరుమల భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి మార్చి దర్శన టిక్కెట్లు చేయనుంది టీటీడీ పాలక మండలి. రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారికి సంబంధించిన మార్చి నెల దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి.

TTD will be releasing Darshan tickets for the month of March online from tomorrow to 24th

రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపులు చేయనుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version