Andhra Pradesh to see heavy rainfall over next 3 days: ఏపీ ప్రజలకు అలర్ట్…నేడు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నేడు అంటే మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. రేపు అంటే బుధవారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో జనాలు చలికి వణికిపోతున్నారు.