టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నడక దారిలో వెళ్లే వారిపై చిరుత దాడి.. చేస్తున్న నేపథ్యంలోనే.. ప్రతి భక్తుడికి కర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది టీటీ. తిరుమల కాలి నడకన వెళ్లే ప్రతి ఒక్క భక్తుడికి ఆత్మరక్షణ కోసం ఒక మంచి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించామని ఈ మేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.
సోమవారంనాడు టీటీటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు భద్రతను కల్పించే విషయమై హైలెవల్ కమిటీ చర్చించింది.ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల వరకే టూవీలర్స్‌కు అనుమతి ఇస్తామన్నారు. పెద్దలకు రాత్రి పది గంటల వరకే నడకదారిలో అనుమతి ఉంటుందన్నారు.