BJP అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ – తులసి రెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి అంటే …. బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. ఇందులో అ ఒక్కరికి ఓటు వేసిన బిజెపికి ఓటు వేసినట్లే! అని తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు బిజెపి శనిగ్రహంలా దాపురించిందని….8 సంవత్సరాలలో విభజన చట్టంలో ఒక్క అంశాన్ని అమలు చేయలేదు. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిందని ఆగ్రహించారు.

బిజెపి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం , మోసం , ద్రోహం చేస్తుంది…ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతీయ పార్టీలు బిజెపి చేతిలో కీలుబొమ్మలు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.ప్రత్యేక హోదా తెస్తామంటూ మూడు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి… రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.

 

నరేంద్ర మోడి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుంది…రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలకు దీనికోసం ఉపయోగించుకుంటుందని ఫైర్ అయ్యారు. సత్యాగ్రహ ఆయుధం ద్వారా బిజెపి కక్ష రాజకీయాలను ఎదుర్కొంటాము…దేశంలో చరిత్ర పునరావృతం అవుతుంది . గతంలో జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయి , చౌదరి చరణ్ సింగ్ లు ఇందిరాగాంధీని వేధించారు. ప్రజలు తర్వాతి ఎన్నికల్లో జనతా పార్టీకి బుద్ధి చెప్పారని తెలిపారు. ప్రస్తుతం నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version