తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకు వెళ్లిన విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రి పయ్యావుల. నీటిని నిలువరించేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్ణాటక ప్రభుత్వం, తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో పయ్యావుల సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సందర్బంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ….తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడం బాధాకరమన్నారు. తుంగభద్ర డ్యాంకు గేట్ లాక్ సిస్టం లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని… గేట్ కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ తుంగభద్ర డ్యాంకు లేదని తెలిపారు.
దీని వల్ల నీరు వృధాగా కిందకు పోతోందని…కొట్టుకుపోయిన గేట్ స్థానంలో ప్రత్యామ్నాయ గేట్ ఏర్పాటుకు ఏపీ వైపు నుంచి సాయం అందిస్తామని ప్రకటించారు. రబ్బర్ డ్యాం ఏర్పాటు చేయాలా..? లేక వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా..? అని చూస్తున్నామన్నారు. డ్యాం అధికారులతో.. డ్యాంపై గతంలో పని చేసిన గన్నయ్య నాయుడు లాంటి నిపుణులతో సంప్రదిస్తున్నామని… అనంత, కర్నూలు జిల్లాల రైతులకు తుంగభద్ర అత్యంత ప్రధానమైన డ్యాం అన్నారు. గేట్ కొట్టుకుపోవడం వల్ల మిరప పంట వేసిన రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని వెల్లడించారు.