కశ్మీర్‌ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి

-

కశ్మీర్‌ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. పహల్గామ్ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందాడు మరో తెలుగు వాసి మధుసూదన్. పహల్గామ్ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన మధుసూదన్ స్వస్థలం నెల్లూరు జిల్లా కావలిగా గుర్తించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు మధుసూదన్.

TERR

కుటుంబంతో కలిసి కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన మధుసూదన్… పహల్గామ్ ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందాడు. జమ్మూ ఉగ్రదాడిలో హైదరాబాద్‌ ఐబీ అధికారి మృతి చెందారు. మృతుడు ఐబీ అధికారి మనీష్‌ రంజన్‌గా గుర్తించారు. తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. హైదరాబాద్‌లో ఐబీ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు మనీష్ రంజన్. పర్యటన కోసం కాశ్మీర్‌ వెళ్లిన మనీష్ రంజన్ ను తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు.

Read more RELATED
Recommended to you

Latest news