రెండు పేర్లు కన్ ఫాం: ముందస్తు బెయిల్ కి అప్లై చేసిన మాజీ మంత్రులు!

-

జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ తెరముందు సంక్షేమాలకు ఎంతపెద్ద పీట వేసి పనులుచేసుకుంటూ ముందుకువెళ్తున్నారో… తెరవనక అవినీతిపరులపై ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు ఏవి అని జనం అనుకుంటున్న సమయంలో సరిగ్గా అచ్చెన్నాయుడిని పట్టుకెళ్లిపోయారు ఏసీబీ అధికారులు.. ఫలితంగా ఇది చేతల ప్రభుత్వం అని భావించారు ప్రజలు!

అచ్చెన్నాయుడి అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్ర ఒకరితర్వాత ఒకరు అరెస్టయిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో నెక్స్ట్ బెర్త్ పితాని సత్యనారాయణకు అన్న మాటలు వినిపిస్తోన్న సమయంలో… అంతకంటే ముందు మరో వీఐపీ ఉన్నారన్నట్లుగా తెరపైకి వచ్చింది.. గంటా శ్రీనివాస్ పేరు! అక్కడితో అయిపోయిందనుకుంటె పొరపాటే… ఈసారి డబుల్ డోస్ ఇవ్వాలనుకున్నరో ఏమో కానీ… గంటాతోపాటుగా అఖిలప్రియ పేరు కూడా తెరపైకి వచ్చింది. నెక్స్ట్ వీరే అని!!

సైకిళ్ల కొనుగోళ్లపై మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపణలతో కూడిన హింట్ ఇప్పటికే ఇచ్చారు! బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంస్థ నుంచే కొనుగోలు చేశారని.. ఫలితంగా ఐదు కోట్ల కుంభకోణం జరిగిందని.. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అని ఆరోపణలు విన్పించాయి. కాబట్టి నెక్స్ట్ బెర్త్ గంటాకు కన్ ఫాం అవ్వొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది!

ఇదే క్రమంలో… తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హత్యకు కుట్రపన్నిన కేసులో ఏ4 నిందితురాలిగా అఖిలప్రియను చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఏ1, ఏ2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరిచ్చిన సమాచారం మెరకు ఏ3, ఏ4 లు అయిన అఖిలప్రియ భర్త భార్గవ్ రాం, అఖిలప్రియలపై కేసులు నమోదు చేశారు.. వీలైనంత తొందర్లో భార్గవ్ రాం.. అనంతరం అఖిలప్రియలు అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈస్థాయిలో వీరిపై కథనాలు రావడానికి గల కారణం… వీరు తాజాగా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు! ఏక్షణమైనా పోలీసులు / ఏసీబీ అధికారులు ఇంటి కాలింగ్ బెల్ నొక్కొచ్చనే అనుమానంతో, భయంతో వీరు ముందస్తు బెయిల్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version